గోకవరం మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు గురువారం సమ్మె చేపట్టారు. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని, నెలకు 26,000 కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. నామినేలుగా పనిచేస్తున్న వీఆర్ఏలను పర్మినెంట్ చేయాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని వారు తెలిపారు.