గంగాధర నెల్లూరు: పెనుమూరు ప్రాథమిక శాఖ వ్యవసాయ సంఘం PACS ఛైర్మన్గా శ్రీనివాసులు బాధ్యతలు
పెనుమూరు ప్రాథమిక శాఖ వ్యవసాయ సంఘం ఛైర్మన్గా శ్రీనివాసులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డైరెక్టర్ యుగంధర్ శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీనివాసులు తెలిపారు.