శ్రీకాకుళం: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు,మునిగిన పంటపొలాలు పరిశీలించిన వ్యవసాయ అధికారి #localissue
శ్రీకాకుళం జిల్లాలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు స్థానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాగులు వంకలు వర్షం నీడతో నిండిపోయి ఎక్కడికి అక్కడే పొలాలకు గడ్డి కొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా యూరియా కొరత ఉండడం అది అందినప్పటికీ వర్షాలు విపరీతంగా పడ్డం తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భవన కార్మికులు, రోజు వారి కూలీలు సైతం పడుతున్న వర్షాలకి పని పాటు లేకుండా ఇంట్లోనే గడపవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.రానున్న దసరా పండుగ సందర్భంగా ఎలా గడపాలో తెలియక ప్రభుత్వమే ఆదుకోవాలని ఎదురుచూస్తున్నారు.విషయం పై మండల వ్యవసాయ శాఖ అధికారి నవీన్ కుమార్ పొలాలను గురువారం పరిశీలించారు.