తాడిపత్రిలోని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలో శుక్రవారం ముందస్తు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. బాణాసంచ కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జే సీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు, కార్యకర్తలతో కలిసి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న రాను నేను బొంబాయికి రాను పాటకు కాసేపు స్టెప్పులు వేశారు. మొత్తం పై ఘనంగా సంబరాలు నిర్వహించారు.