నగరి: పరమేశ్వర మంగళం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పి ప్రమాదం
పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం వద్ద ఆదివారం బైకు అదుపుతప్పి కల్వర్టులో బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైకు మీద వెళుతున్న వ్యక్తికి ఇనుప చువ్వలు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని తిరుపతి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.