కోవెలగుట్టపల్లిలో పశువులకు గాలికుంటు టీకాలు వేసిన ఎల్ఎస్ఏ ఈశ్వర్ నాయక్
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని కోవెలగుట్టపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఎల్ఎస్ఏ ఈశ్వర్ నాయక్ పశువులకు గాలి కుంట టీకాలు వేశారు. గ్రామంలోని పాడి రైతులందరూ ఈ గాలికుంట టీకాలు పశువులకు వేయించాలని ఆయన సూచించారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ సుధా నిధి ఆదేశాలతో మున్సిపాలిటీలోని అన్ని గ్రామాలలో ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు పాడి పశువులకు గాలికుంట టీకాలు వేస్తున్నామని రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.