కొండపి: అనుమతులతో మాత్రమే దీపావళి మందు సామాగ్రి విక్రయించాలని ప్రజలను హెచ్చరించిన టంగుటూరి ఎస్సై నాగమల్లేశ్వరరావు
తాత్కాలిక అనుమతులు లేకుండా దీపావళి సామాగ్రిని మండలంలో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు వ్యాపారులను హెచ్చరించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రతిరోజు దుకాణాలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ఎవరన్నా అనుమతులు తీసుకోకుండా దీపావళి టపాసుల ముందు సామాగ్రి విక్రయిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కలెక్టర్ వద్ద అనుమతులు తీసుకొని అధికారులు నిర్దేశించిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.