అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి : జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ
Anantapur Urban, Anantapur | Sep 15, 2025
జిల్లా లోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అర్జీదారులు ఎంతో ఆశతో ప్రజా సమస్యల పరిష్కారవేదికకార్యక్రమమునకు వస్తారని అర్జీదారుడు సంతృప్తిచెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణన్ శర్మ ఆదేశించారు.సోమవారం ఉదయం 10 గంటల సమయంలో కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్)ప్రజా సమస్యలపరిష్కారకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తోపాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డిఆర్ఓ మలోలా ప్రజల నుంచి 334 ఫిర్యాదులను స్వీకరించామన్నారు.