జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులకు అందించి, వారియొక్క సమస్యలను వివరించారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి ఫిర్యాదుల నేపథ్యాన్ని తెలుసుకొని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.