రేణిగుంట రైల్వే స్టేషన్ లో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్
రేణిగుంట రైల్వే స్టేషన్లో వ్యక్తి హల్చల్ రేణిగుంట రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ప్రయాణికుల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లపైకి ఎక్కి హల్చల్ చేశాడు. అతనికి సమీపంలోని 25 వేల కె.వి విద్యుత్ లైన్ తగిలే ప్రమాదం ఉండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే IPF వెంకటేశ్వర్లు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి లైన్ ఆఫ్ చేయించి, ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించి అభయ క్షేత్రానికి తరలించారు.