లాడ్జిలో యువకుడి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేసిన వన్ టౌన్ ఎస్ఐ
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ధరణి ఇన్ లాడ్జి నందు సోమవారం ఆత్మహత్య చేసుకున్న యువ పారిశ్రామికవేత్త కట్ట త్రినాధ్ చౌదరి మృతికి సంబంధించిన వివరాలను వన్ టౌన్ ఎస్సై మీడియాకు తెలియజేశారు సోమవారం లాడ్జి సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జి వద్దకు వెళ్లి లాడ్జి తలుపులను పగలగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు కుటుంబ సభ్యులు మరియు బంధువుల సమక్షంలో మృతిక సంబంధించిన వివరాలను ఎంక్వైరీ చేస్తున్నారు గత కొంతకాలంగా ఒంగోలులో మెడికల్ షాపుల వ్యాపారాలు నిర్వహిస్తున్న త్రినాధ్ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి మరియు మిగిలిన వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు .