సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుందనీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాల్లో ప్రతి అడుగు మహిళా సాధికారితకే అని తల్లికివందనం, ఫీజు రియంబర్స్మెంట్తో మహిళా విద్యకు ఊతం అన్నారు. డ్వాక్రా, దీపం పథకం మొదలు ఉచిత బస్సు, ఉచిత సిలిండర్ల వరకు మహిళలకు ఎంతో మేలు అని తెలిపారు.