తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా పానగల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని మండల విద్యాధికారి శ్రీనివాసులుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వినతి పత్రం అందజేశారు. టిపిటిఎఫ్ వనపర్తి జిల్లా సహ కార్యదర్శి పరమేష్, ఉపాధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాములు పై జరిగిన మానసిక దాడి, అవమానం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వాపోయారు. పాఠశాలకు అయ్యప్ప మాల తో వచ్చిన విద్యార్థిని సదరు ప్రధానోపాధ్యాయుడు లెక్కలు అడగగా చెప్పకపోవడంతో కాసేపు నిల