ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ చుండూరు రవి మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పకొచ్చాన్ని అందజేశారు. నియోజకవర్గంలో పార్టీ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను గురించి మాజీ ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గ వైసిపి పోరులో ప్రధానంగా నిలబడుతున్నట్లు తెలియజేయడంతో పాటు పలు కార్యక్రమాలలో పాల్గొన్న వివరాలను మరియు కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న వివరాలను కూడా మాజీ ముఖ్యమంత్రి తెలియజేశారు ఒంగోలు కొత్తపట్నం మండలాలలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో స్థానిక వైసిపి నేతలతో కలిసి చర్చించారు