సిరిసిల్ల: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ముస్తాబాద్ మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం
దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రెడ్డి కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం అభినందనీయమని ముస్తాబాద్ మండల రాజ్ బహదూర్ వెంకట్ రాంరెడ్డి సంఘం మండల అధ్యక్షులు చిన్ని అంజిరెడ్డి అన్నారు. రెడ్డి కార్పొరేషన్‌ను సీఎం ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిందని హర్షం వ్యక్తం చేశారు.