బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో భార్య ఇంట్లోకి రానివ్వలేదని భర్త ఆత్మహత్య!
పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో బాలాజీ నాయక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వారి వివరాల మేరకు.. సోమవారం అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన బాలాజీని భార్య ఇంట్లోకి రానివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఇంటి పైనుంచి దూకాడు.గాయపడటంతో కుటుంబీకులు వెంటనే ధర్మవరం ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.