వైసీపీ అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు : కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై కదిరిలో జరుగుతున్న అభివృద్ధిపై వైసీపీ ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తోందని దీని ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే తెలియజేశారు. అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను దోచుకున్న పార్టీ వైసీపీ నే అని అన్నారు.