ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నికరం పల్లి గ్రామంలో ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు జింకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యేలు అన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణను విరమించుకునేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.