చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారికి శుక్రవారం వేద పండితుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన వేద పండితులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.