జమ్మలమడుగు: కమలాపురం : సబ్ జైల్లో ఉన్న ఇడమడక శ్రీకాంత్‌ను పరామర్శించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
కడప జిల్లా కమలాపురం సబ్ జైల్లో ఉన్న ఇడమడక శ్రీకాంత్‌ను మంగళవారం మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరామర్శించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ డాబా పెట్టుకుని జీవనోపాధి కొనసాగిస్తున్న వైసీపీ నేత శ్రీకాంతును అక్రమంగా మర్డర్ కేస్ పెట్టి జైల్లో పెట్టడం దారుణమన్నారు. ఎలాంటి చిన్న గొడవ ఘర్షణ వాతావరణం లేకపోయినా మర్డర్ కేస్ పెట్టడం ఏమిటని రఘురామిరెడ్డి ప్రశ్నించారు.