మార్కాపురం: చెరువు కట్ట రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెరువు కట్ట రోడ్డును ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. త్వరలోనే చెరువు కట్ట రోడ్డును ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది అన్నారు. పూర్తిస్థాయిలో రోడ్డును ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.