గద్వాల్: ఇటిక్యాల: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు పథకాల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన వారికి అర్హులైన ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.....ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందించడం జరిగింది.ఎమ్మెల్యే మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీ లో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీ లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు.