పీలేరు పట్టణంలోని శివాలయంలో భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా అమావాస్య నోములు
అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు పట్టణంలోని శివాలయంలో భక్తిశ్రద్ధలతో అమావాస్య నోములు నిర్వహించారు. పీలేరు పట్టణం పాత బస్టాండ్ సమీపంలో గల అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం ఉదయం నోము వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ నోము వ్రతాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో అమావాస్య నోములు నోచుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు.అదే విధంగా దొడ్డి పల్లి పంచాయితీ లోని శివరాంపురం శివాలయంలో అమావాస్య నోములు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సౌకర్యాలు కల్పించారు