పులివెందుల: వేంపల్లి లో బైకులతో స్టంట్లేస్తున్న మైనర్ బాలురు, హడలిపోతున్న ఇతర వాహనదారులు
Pulivendla, YSR | Oct 25, 2025 కడప జిల్లా వేంపల్లిలోని గండి నుంచి పులివెందులకు వెళ్లే బైపాస్ రోడ్డులో మైనర్ బాలురు బైక్‌లతో విన్యాసాలు చేస్తూ ఆ దారిన వెళ్లే వాహన చోదకులను హడలెత్తిస్తున్నారు. నిన్న శుక్రవారం పులివెందుల డిఎస్పి మురళి నాయక్ మైనర్లకు వాహనాలు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  పులివెందులలో ప్రకటించారు. కానీ ఈరోజు శనివారం వేంపల్లి లో మైనర్లు బైకులతో స్టంట్ లేస్తూ హల్చల్ చేస్తున్న వీరికి అడ్డుకట్ట పోలీసులు వేస్తారో లేదో చూడాలి. సదరు మైనర్ బాలురు తోలే వాహనాలకు ఎలాంటి నంబర్ ప్లేట్లు కూడా లేకపోవడం విశేషం. ఆ దారిన వెళ్లేవారు వారిని మందలిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు.