తమను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు
Eluru Urban, Eluru | Sep 16, 2025
ఏలూరు వన్ టౌన్ లోని గుర్రం తులసి అనే వ్యక్తి ఇంటి ఎదుట నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.. తమను కులం పేరుతో దూషించారని రంభ రాజా అనే వ్యక్తి ఆరోపిస్తూ నితిన్ చేపట్టారు.. గత 15 సంవత్సరాల క్రితం తాను బాలరాజు కుమారి అనే మహిళతో కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి కూడా తన భార్యను తన పుట్టింటి వారు పట్టించుకోకుండా వదిలేశారని ఆరోపించారు. తన భార్యకు చెందాల్సిన ఆస్తిలో వాటా కోసం నిలదీస్తే తనను తన భార్యను కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు..