అనధికారిక కొళాయి కనెక్షన్లు క్రమబద్ధీకరించుకోండి
- నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ పజులుల్ల
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని నరసారెడ్డి కండ్రిగలో శనివారం మున్సిపల్ కమిషనర్ ఫజులుల్ల పర్యటించారు. అనధికారిక కొళాయి కనెక్షన్ లో ఉన్న ఇళ్లను గుర్తించి వాటిని క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. మున్సిపాలిటీకి కొళాయి డిపాజిట్ పన్ను చెల్లించకుండా నీటిని వినియోగించడం చట్టరీత్యా నేరమని ఆయన తెలిపారు. ఈ చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. అనధికారికనెక్షన్లు కలిగి ఉన్న వారంతా క్రమబద్ధీకరించుకోవాలని ఆయన సూచించారు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట మున్సిపల్ సచివాలయ సిబ్బంది ఉన్నారు.