అమలాపురం రూరల్ పరిధిలోని శెట్టిపల్లి కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
అమలాపురం రూరల్ మండలం శెట్టిపల్లి కాలువలో బుధవారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అమలాపురం రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు పర్యవేక్షణతో కాలువ నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.