పట్టణంలోని భరద్వాజ తీర్థం వద్ద ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలు
ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలు శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థం వద్ద ఆటో బోల్తా పడి ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెల్లూరుకు చెందిన కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తిలో బంధువుల ఇంటికి జన్మదిన వేడుకలు కోసం వచ్చారు. జన్మదిన వేడుకల అనంతరం లోబావి (భరద్వాజతీర్థం) సందర్శించి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంతలో ఆటో అదుపు తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు రెహనా (50), కరిష్మా (22), భాను (23), జాకీర్ (23), ఆశా బేగం (65), మహమ్మద్ అలీ (8)