అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పెద్దపప్పూరు మండలం అశ్వర్థ క్షేత్రంలో వెలిసి ఉన్న అశ్వర్థ నారాయణ స్వామి తిరుణాల సోమవారం నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అమావాస్య కావడంతో ఈ ఆదివారం కాకుండా సోమవారం నుంచి తిరుణాల ప్రారంభమవుతుందని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.