ఉదయగిరి: గుండెమడకలో TTD శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా నిర్మించనున్న సీతారామాంజనేయ స్వామి ఆలయనికి భూమి పూజ చేసిన మంత్రి ఆనం
వింజమూరు మండలం గుండె మడకల గ్రామంలో శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయం నిర్మించనున్నారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి రూ.కోటి మంజూరు చేసింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పాల్గొన్నారు. అనంతరం నరవాడలోని శ్రీ వెంగమాంబ ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆనం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు