అసిఫాబాద్: అత్తింటిని నిప్పు పెట్టిన అల్లుడు,
లింగాపూర్ మండలంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. లింగాపూర్ ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం. జైనూర్ కి చెందిన ముజాహీద్ కు ఎల్లాపటార్ కు చెందిన షమాబితో 9నెలల క్రితం వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ తరచూ భార్యతో గొడవ పడే వాడు.. దీంతో భార్యా తన పుట్టింటికి వెళ్లింది. గురువారం సాయంత్రం ఎల్లపటార్ కు వచ్చిన భర్త మళ్లీ అత్తగారింట్లో గొడవకు దిగాడు. కోపంతో భర్త ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ లీక్ చేసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.