*జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ఆనంతో కలెక్టర్ సమావేశం
అన్ని రంగాల్లో జిల్లాను అగ్రపథంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన కలెక్టర్ హిమాన్షు శుక్లా కు సూచించారు. శుక్రవారం నెల్లూరు సంతపేటలోని దేవాదాయ శాఖా మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మర్యాదపూర్వకంగా కలిశారు