తాడిపత్రి: తిప్పారెడ్డి పల్లిలో విషాదం, శ్రీదేవి అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
యాడికి మండలం తిప్పారెడ్డిపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీదేవి ఇంటిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి గతంలో పాముకాటుకు గురైంది. కాలు సెప్టిక్ అయింది. దీంతో వైద్యులు కాలు తీసేశారు. దీంతో మనస్థాపానికి గురైంది. గత కొన్ని రోజులుగా ముభావంగా ఉండేది. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య వేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.