రాయదుర్గం: పట్టణంలోని నగరేశ్వర కన్యకా పరమేశ్వరి దేవాలయంలో డ్రై ప్రూట్స్ అలంకాలంలో అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం
రాయదుర్గం పట్టణంలోని కోట ఏరియాలో వెలసిన శ్రీ నగరేశ్వర కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. రకరకాల డ్రై ప్రూట్స్ తో సుందరంగా అలంకరణ భక్తులకు దర్శనమిచ్చారు. డ్రై ప్రూట్స్ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు.