నాగలాపురం: బస్సు కింద పడి మహిళ మృతి బస్సు కింద పడి ఓ మహిళ చనిపోయిన ఘటన నాగలాపురం(M) రాజీవ్ నగర్ వద్ద చోటు చేసుకుంది. కుమారుడి ఇంటికి వెళ్లడం కోసం అజీమా బీ(70) RTC బస్సు ఎక్కింది. బస్సు దిగే సమయంలో అదుపుతప్పి కింద పడింది. డ్రైవరు కదలడంతో ఆమె చేయిపై బస్సు ఎక్కింది. తీవ్ర గాయం కావడంతో తిరుపతికి తరలించారు. అక్కడ డాక్టర్లు చేతిని తొలగించి మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. అక్కడ ఆమె శనివారం మరణించినట్లు SI సునీల్ తెలిపారు.