రాష్ట్ర ప్రజలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ క్రైస్ట్ జీవితం ఆదర్శమని ఆయన మార్గం సదా అనుసరణీయమని ఆయన తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు మంచి మార్గాన్ని శాంతియుత సమాజాన్ని అందిస్తాయి తెలిపారు ఆ కరుణామయుడు చూపిన మార్గం నేటికి సమాజానికి అవసరమని తెలిపారు ప్రేమ త్యాగం, సహనం ఓర్పు క్షమాగుణం, స్నేహ గుణం ఆ దయామయుడు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప మార్గాలని తెలిపారు.