తాటిపర్తి గ్రామం : జంట హత్యలు ఘటనలో తప్పించుకున్న మూడో వ్యక్తి సూరిబాబు అనుభవాన్ని పంచుకున్నాడు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జరిగిన జంట హత్యల ఘటనలో తప్పించుకున్న మూడో వ్యక్తి కుంపట్ల సూరిబాబు తన అనుభవాలను శనివారం పంచుకున్నారు. గంగాధర్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కరుణించలేదు అని నిన్ను ఎలాగైనా చంపిస్తానని మాట్లాడాడని వాపోయాడు. ఫోన్ చేసి పిలిచి గొంతు నులిమి కాలువలోకి తోసి చంపడానికి ప్రయత్నించాడని, ఆ ఘటనతో తాను షాకు గురయానని సూరిబాబు వాపోయారు.