ఉదయగిరి: జలదంకి మండలం 9వ మైలు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ ఆర్టిసి బస్సు
జలదంకి మండలం 9వ మైలు వద్ద అదుపుతప్పి ఆర్టీసీ బస్సుబోల్తా పడింది. ఎదురుగా లారీ రావడంతో తప్పించబోయి బస్సు బోల్తా పడినట్టు డ్రైవర్ చెబుతున్నాడు. కావలి నుంచి జలదంకి మండలం చామదల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణికులు తక్కువ మంది ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు..