లింగాపురం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి వెల్దుర్తి మండలాలలో పాటు నల్లమల్ల అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో చంద్రవంక నది మాచర్ల పట్టణ శివారులో ఉదృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడగ గ్రామం నుంచి లింగాపురం గ్రామానికి వెళ్లే రహదారి ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పూర్తిగా స్తంభించిపోయింది రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి