పులివెందుల: గురజాడ అడుగుజాడ ఆదర్శం : వేంపల్లి లో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి వెల్లడి
Pulivendla, YSR | Sep 21, 2025 స్వర్గీయ గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడని, ఆయన అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లిలో స్వర్గీయ గురజాడ 163 వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ "దేశమంటే మట్టి కాదోయ్ -- దేశమంటే మనుషులోయ్" అన్న అమర సందేశాన్ని సమాజానికి అందించిన దేశభక్తుడు ,సంఘసంస్కర్త గురజాడ అని కొనియాడారు.