నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని లింగమయ్య దారిలో ఆదివారం రాత్రి కొండచిలువ రోడ్డు దాటుతుండగా వాహనదారులు ఆసక్తితో గమనించారు, కొండచిలువకు ఎటువంటి హాని చేయకుండా దారి వదలడంతో పొలాలకు వెళ్ళింది, ఈ మధ్యకాలంలో ఇక్కడ ఎక్కువగా కొండా చిలువలు తిరుగుతున్నాయని తరచూ అవి వాహనదారుల కంటపడుతున్నాయని స్థానికులు తెలిపారు, పశువుల మేతకు వెళ్లే కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు