దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడి ముగ్గురికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 11, 2025
అనంతపురం నగర శివారులోని రజాక్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడి ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.