చిన్నపాండూరు వద్ద అపోలో టైర్ల పరిశ్రమ బస్సులను అడ్డుకున్న కార్మికులు
అపోలో టైర్ల పరిశ్రమ బస్సులను అడ్డుకున్న కార్మికులు వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు ఏపీఐఐసీ పరిధిలో ఉన్న అపోలో టైర్ల పరిశ్రమకు చెందిన బస్సులను స్థానికులు శుక్రవారం మధ్యాహ్నం అడ్డగించారు. నాలుగు రోజుల క్రితం అదే పరిశ్రమకు చెందిన బస్సు ప్రైవేట్ ఆటోను ఢీకొట్టింది. అందులో ప్రయాణిస్తున్న కార్మికులకు గాయాలయ్యాయి. దెబ్బతిన్న ఆటో, ప్రమాదానికి గురైన కార్మికుల ఆరోగ్య పరిస్థితుల గురించి స్పందించకపోవడంతో ఆగ్రహంతో అపోలో పరిశ్రమ బస్సులను అడ్డగించారు.