నారాయణపేట్: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అరుణ
జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంపీ డీకే అరుణ శుక్రవారం పలు ఆలయాల్లో దర్శనం చేసుకునిప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యకా పరమేశ్వరి, గజలేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.