మంచిర్యాల: కమ్యూనిటీ భవనాల అభివృద్ధికి చర్యలు: మంత్రి గడ్డం వివేకానంద
ప్రభుత్వం ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలోని చున్నంబట్టివాడలో గల కమ్యూనిటీ హాల్ పని విస్తరణ, నిర్మాణ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కమ్యూనిటీ హాల్ పని విస్తరణ, నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.