వినుకొండలో భారీ కొండ చిలువ కలకలం
పల్నాడు జిల్లా వినుకొండలో ఓ పెద్ద కొండ చిలువ కలకలం రేపింది. మంగళవారం పట్టణంలోని 22వ వార్డులో కొండచిలువ వల్ల పిల్లి ప్రాణం పోయిందని స్థానికులు తెలిపారు. సుమారు 12 అడుగులు ఉన్న ఆ కొండ చిలువను చూసి ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.