తాడికొండ: అమరావతి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బిందుమాధవ్
అమరావతి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ బిందుమాధవర్ పరిశలించారు. ధరణికోట, ఉంగుటూరు, ఎనుకపాడు తదితర గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.