భువనగిరి: రావి నారాయణరెడ్డి చేసిన పోరాటాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం:MLA కుంభం,MP చామల,MLC సత్యం
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలోని పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు ఈ సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావి నారాయణరెడ్డి చేసిన పోరాటాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమన్నారు .ఇలాంటి మహనీయుల స్ఫూర్తితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.