మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జనవరి 5వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా చింతలపల్లి పీడర్ పరిధిలోని వర్ధన పల్లి, గోహారపల్లి, కొత్తపల్లి, కూరాకువారి పల్లి, చింతలపల్లి, హనుమంతురాయనిపల్లి, ఓబులాపురం గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.