డోన్ లో పిహెచ్సి భవనం మరమ్మత్ పనులకు నిధులు మంజూరు.. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Dhone, Nandyal | Sep 15, 2025 నంద్యాల జిల్లా డోన్ ఏడో వార్డు పీహెచ్సీ భవనం మరమ్మతుల కోసం ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ.6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సోమవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి అవసరమైన పరిపాలన అనుమతులు ఇచ్చారని వివరించారు. సంబంధిత ఇంజినీర్లు సకాలంలో, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు.